పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో పవన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ క్రేజియేస్ట్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ లో రెండవ హీరోయిన్ పాత్ర కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో ఏజెంట్ మరియు గాండీవదారి అర్జున సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న సాక్షి వైద్య కనిపించబోతున్నట్లు ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా భాగం పూర్తి కూడా అయింది. అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను ...  ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోయే నటుడి ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ప్రతిబన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో పవన్ మరియు ప్రతిబన్ కి మధ్య సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే పవన్ ... హరీష్ కాంబో లో రూపొందిన గబ్బర్ సింగ్ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: