నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇక పోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి బాబి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాబి , బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ దర్శకుడు బాలయ్య సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ హీరోగా రూపొందించబోయే సినిమా కోసం బాబి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడుగా తీసుకోవాలి అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే బాబి దర్శకత్వం లో రూపొందినటువంటి సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వాల్తేరు వీరయ్య సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో గబ్బర్ సింగ్ సినిమా మినహాయిస్తే మిగతా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ మూడు సినిమాల సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి బాలయ్య సినిమా కోసం బాబి దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: