రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్యపాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చంద్రముఖి 2'. సూపర్ హిట్ మూవీ 'చంద్రముఖి'కి సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.ఐతే, ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అలాగే, సెన్సార్ టాక్ కూడా బాగా వైరల్ అవుతుంది. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి అని, ముఖ్యంగా లారెన్స్ నటన అద్భుతంగా ఉందని.. అలాగే కంగనా రనౌత్ గ్లామర్ అండ్ ఆమె నటన కూడా చాలా బాగుందని టాక్ నడుస్తోంది.'చంద్రముఖి 2' లో హైలైట్స్ విషయానికి వస్తే..

1. చంద్రముఖి సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో, చంద్రముఖి 2లో ఇంటర్వెల్ బ్యాంగ్ నే ఆ రేంజ్ లో ఉంటుందట. ఇంటర్వెల్ లోనే అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయట.

2. అలాగే, 'చంద్రముఖి 2' ఫస్ట్ హాఫ్ ను మించి సెకండాఫ్ ఉంటుందని అంటున్నారు. అన్నట్టు చంద్రముఖి సినిమాలో వేట్టై రాజాగా రజనీకాంత్ గారు కనిపించారని, అదే పేరుతో ఈ సినిమాలో లారెన్స్ కనిపిస్తారు. రజనీ స్టైల్ ను లారెన్స్ బాగానే మెయింటైన్ చేశాడట.

3. 'చంద్రముఖి 2' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. హారర్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమా అట ఇది. ముఖ్యంగా లారెన్స్ - కంగనా రనౌత్ మధ్య సాగే థ్రిల్లింగ్ సీన్స్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయట.

4. పైగా ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్ కూడా ఉందట. ప్రస్తుతానికి మేకర్స్ దాన్ని దాచారని.. రేపు సినిమా చూశాక, మేకర్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారని అంటున్నారు.

కాకపోతే.. 'చంద్రముఖి 2' లో హారర్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఫుల్ గా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే చాలా నీరసంగా సాగింది అని, అలాగే ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడటానికి కాస్త ఇబ్బంది పడాలి అని అంటున్నారు. పైగా కొన్ని సీన్స్ లో అస్సలు లాజిక్ కూడా ఉండదట. అది 'చంద్రముఖి 2' సినిమా పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: