ఈవారం లాంగ్ వీకెండ్ రావడంతో అక్టోబర్ 2 గాంధీజయంతి వరకు వరస సెలవలు రావడంతో ఈ హాలీడే జోష్ ను క్యాష్ చేసుకోవడానికి మూడు సినిమాలు ఒక దానిపై ఒకటి పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో ఈమూడు సినిమాలలో విజేత ఎవరు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. అనూహ్యంగా ఈవారం విడుదల అవుతున్న మూడు సినిమాలు మాస్ సినిమాలు కావడంతో ఈవారం జరగబోతున్న మాస్ జాతర ఆశక్తిగా మారింది.


ఇక ఈవారం విడుదలకాబోతున్న రామ్ బోయాపాటి ల ‘స్కంద’ మూవీ బోయపాటి మాస్ డైరెక్షన్ పైన శ్రీలీల గ్లామర్ పైనా బాగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. అయితే బోయపాటి ఇప్పటివరకు తీసిన సినిమాలలో బాలయ్యతో తీసిన సినిమాలు తప్ప మిగతా హీరోలతో తీసిన సినిమాలు చెప్పుకోతగ్గ స్థాయిలో బ్లాక్ బష్టర్ హిట్ కాలేదు.


అయితే రామ్ ఊర మాస్ అవతారం ఈమూవీకి కలక్షన్స్ కురిపిస్తుందని రామ్ ఆభిమానులు భావిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత సరైన హిట్ లేక సత్యమతమైపోతున్న రామ్ ఈమూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈసినిమాతో పోటీగా విడుదల అవుతున్న ‘చంద్రముఖి 2’ ఘన విజయం సాధిస్తుందని చాల ఆశలు పెట్టుకున్నాడు.


రజనీకాంత్ కెరియర్ లో బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన ‘చంద్రముఖి’ సీక్వెల్ గా ఈమూవీ వస్తున్నప్పటికీ ఈమూవీ పై చెప్పుకోతగ్గ స్థాయిలో అంచనాలు లేవు. అయితే ఈమూవీలో ఉండబోతున్న ఊహించని ట్విస్ట్ లు ఈమూవీకి ఘనవిజయం సాధించి పెడతాయని ఈమూవీ యూనిట్ భావిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలను లెక్క చేయకుండా శ్రీకాంత్ అడ్డాల తీసిన ‘పెదకాపు 1’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈమూవీ పై కూడ అంచనాలు బాగా ఉన్నాయి.  ఈ వీకెండ్ తెలుగు సినిమాలకు పోటీ యిస్తూ బాలీవుడ్ నుంచి ‘ఫక్రే 3’ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఈవారంలో విడుదల అవుతున్న మూడు మాస్ సినిమాల పైనే అందరి దృష్టి ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: