కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం వారిసు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇలా వారసుడు మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ... బాలీవుడ్ నటుడు సంజయ్ దత్మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

అలాగే ఒక సాంగ్  ను కూడా ఇప్పటికే ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ కూడా జనాల నుండి వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ రోజు ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: