మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నారు. 

అలాగే ఈ మూవీ ట్రైలర్ ను కూడా అక్టోబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్న ఇద్దరు నటీనటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేస్తూ వారు ఈ సినిమాలో ఏ పాత్రలను పోషించారు అనే విషయాలను కూడా తెలియజేశారు. తాజాగా ఏ మూవీ బృందం వారు ఈ సినిమాలో అను కీర్తి వాస్ ... జయవాని పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం అధికంగా ప్రకటిస్తూ ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ఇకపోతే ఈ పోస్టర్ లో ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న చీరను కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన నడుము , ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉంది. ఇకపోతే ఈ మూవీ నుండి జీసు సేన్ గుప్తా ... సిఐ మౌళి పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటిస్తూ ఓ  పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఈ నటుడు పోలీస్ డ్రెస్ వేసుకొని చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్ లు కూడా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: