సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో వాళ్లకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా రకాల సినిమాలని చేస్తూ ఉంటారు. నిజానికి ఒక హీరో తన ఎంటైర్ కెరియర్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ జీవితం చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లు చేసిన క్యారెక్టర్లు మొత్తం కళ్ళ ముందు కదిలేలా ఉండాలి అని చాలామంది నటులు సినిమాల్లో వాళ్ళు చేసే క్యారెక్టర్ల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు.

అయితే మన తెలుగులో స్టార్ హీరోలు కొందరు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవించే మనిషిలాగా మాత్రం అసలు క్యారెక్టర్లు చేయడం లేదు. అందులో మహేష్ బాబు ముందు స్థానంలో ఉంటాడు. ఆయన ని కనుక చూసుకున్నట్లయితే మహర్షి భారత్ అనే నేను లాంటి సినిమాల్లో ఆయన చాలా రిచ్ పర్సన్ లాగా కనిపిస్తాడు. కార్లలో తిరుగుతూ, ఫ్లైట్ లలో వెళ్తూ అలాంటి రోల్స్ మాత్రమే చేస్తున్నాడు అంతేగాని ఒక అనగారిన వర్గానికి చెందిన ఒక కుర్రాడిలా మాత్రం ఆయన ఒక్క కైరెక్టర్ కూడా చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.ఇక అందుకే ఆయనకి మొత్తం రిచ్ పర్సన్ గా ఉండే క్యారెక్టర్ లని మాత్రమే డైరెక్టర్లు రాస్తున్నారు.  దానివల్ల ఆయన అవే క్యారెక్టర్ లోని చేస్తూ వస్తున్నారు.


ఇక నిజానికి పుష్ప సినిమాని మహేష్ బాబు చేయాలి కానీ, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ అనగారిన వర్గాలకు సంబంధించింది కావడం ఆ మట్టి మనిషి లాగా చేయడం తన వల్ల కాదు అనుకున్న మహేష్ బాబు ఆ సినిమాని వదులుకోవడం జరిగింది. ఇక సినిమాలో మంచి నటనతో మెప్పించిన అల్లు అర్జున్కి సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ఒక నటుడు అన్నప్పుడు అన్ని రకాల క్యారెక్టర్లని చేస్తూ ఉండాలి, వీలైతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అడుక్కునే క్యారెక్టర్ కూడా చేయాల్సి వస్తుంది.వాటన్నిటికీ సిద్ధంగా ఉన్నప్పుడే ఒక నటుడు పరిపూర్ణ నటుడు అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: