ఇటీవల కాలంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న రామ్ సినిమాలు.. ఇక మొదటి రోజు నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి అని చెప్పాలి. అయితే ఒకటి రెండు రోజులు పాజిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత కలెక్షన్ల విషయంలో మాత్రం రామ్ నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరుస్తూ ఉన్నాయి. అప్పుడెప్పుడో పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు రామ్ పోతినేని.


 ఆ తర్వాత నటించిన సినిమాలు మాత్రం   ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు అని చెప్పాలి.  అయితే ఇటీవల యాక్షన్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను తో స్కంద అనే మూవీ చేశాడు రామ్ పోతినేని. ఇక ఈ సినిమాపై అందరిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీ లీలా హీరోయిన్గా నటించింది. అయితే భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటడం కూడా కష్టమే అన్న విషయం తెలుస్తుంది.


 ఎందుకంటే ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ మూవీ అటు క్లాస్ ప్రేక్షకులకు మాత్రం అస్సలు నచ్చడం లేదు. దీంతో ఇక రామ్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇక ఫ్లాప్ గా మిగిలిపోవడం మాత్రం ఖాయమని సినీ విశేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో అటు రామ్ పోతినేని మళ్లీ పూరి జగన్నాథ్ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వల్ గా డబల్ ఇష్మార్ట్ అనే సినిమాను రామ్ తో తీసేందుకు పూరీ జగన్నాథ్ సిద్ధమయ్యాడు.



 వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది అని చెప్పాలి. అంతేకాదు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో.. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో రామ్ మార్కెట్ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో అటు థియేట్రికల్ రైట్స్ కు ఇప్పుడు భారీ రేంజ్ లోనే డిమాండ్ నెలకొంది. ఓటీటిలో సైతం రామ్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది అని చెప్పాలి. మరి పూరి- రామ్ కాంబో ఎలాంటి హిట్ కొట్టబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: