మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నారు.

దానితో ఈ మూవీ లో రవితేజ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ ని అభిషేక్ నామ నిర్మిస్తున్నాడు.  ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ చేసిన నిర్వహిస్తోంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఈవెంట్ ను అక్టోబర్ 3 వ తేదీన ముంబై లో నిర్వహించనున్నట్లు ... అలాగే ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 15 వ తేదీన గ్రాండ్ గా హైదరాబాదులో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ పై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: