తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో విష్ణు విశాల్ ఒకరు. ఈయన ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో నటించి మంచి అద్భుతమైన గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా రూపొందిన రాక్షసన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు పేరుతో రీమిక్ చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈ నటుడు తాను నటించిన "ఎఫ్ఐఆర్" అనే సినిమాను కూడా తెలుగు లో విడుదల చేశాడు. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత ఈ నటుడు ఘట్టా కుస్తీ అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను తెలుగు లో మట్టి కుస్తీ పేరుతో విడుదల చేయగా ఈ మూవీ కి తెలుగు సినీ ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు లాల్ సలాం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తూ ఉండగా ఈ మూవీ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.  తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: