నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దసరా అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. బొగ్గు గనిలో రా అండ్ రస్టిక్ పాత్రలో నటించిన నాని మాస్ ప్రేక్షకుల నుంచి క్లాస్ ప్రేక్షకుల వరకు కూడా అందరిని మెప్పించి బ్లాక్ బస్టర్ సొంత చేసుకున్నాడు. ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే ఎమోషనల్ డ్రామా తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



 సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఒక క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేయడానికి నాని సిద్ధమయ్యాడట. మరోసారి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ లో ఇప్పటికీ అంటే సుందరానికి చిత్రం వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుంది అన్నది తెలుస్తుంది  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తూ ఉండగా హీరోయిన్గా ప్రియాంక అరుణ్ మోహన్ నటించబోతుందట. అయితే గతంలో నాని, ప్రియాంక అరుల్ మోహన్ గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించగా.. వీరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది  మరోసారి ఇద్దరు జంటగా అలరించబోతున్నారట. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందట.



 అయితే ఒకప్పుడు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు అందుకున్న ప్రియాంక అరుల్ మోహన్ ఆ తర్వాత మాత్రం అవకాశాలు తగ్గడంతో ఎక్కడ తెరమీద కనిపించలేదు. అయితే కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది అని చెప్పాలి. ఇక తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ లోను నటిస్తోంది  ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే మళ్ళీ ప్రియాంక అరుల్ మోహన్ కెరియర్ ఊపందుకు ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: