మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో రవితేజ సోలో హీరో గా నటించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక సోలోగా రావణాసుర మూవీ తో ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయినా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మిస్తూ ఉండగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , హిందీ , భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను అక్టోబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను అక్టోబర్ 3 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ముంబై లోని ఫన్ రిపబ్లిక్ మాల్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: