నాచురల్ స్టార్ నాని ఇటీవల దసరా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత మళ్ళీ హాయ్ నాన్న సినిమాతోపేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో  హీరోయిన్గా నటిస్తోంది. శౌర్యవ్ దర్శకుడిగా ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అయితే  ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలి అని ప్లాన్ చేశారు. డిసెంబర్ నెలలో విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆ తేదీన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలవుతుంది. ఇటీవల రిలీజ్ డేట్ ని సైతం ప్రకటించారు మేకర్స్. ఇక సలార్ కి పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలి అంటే కొద్దిగా టెన్షన్ పడుతున్నారు దర్శక నిర్మాతలు. అలా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ ఒకటిన రిలీజ్ చేద్దామని అనుకున్నప్పటికీ అదే రోజు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా విడుదల అవుతుంది.

సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో తెలుగు అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అలానే రెండోవారం విడుదల చేద్దామంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు విడుదలవుతున్నాయి. డిసెంబర్ 8న ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. ఇవన్నీ కాకుండా డిసెంబర్ 15న విడుదల చేద్దాము అంటే ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా ఉంది. పాన్ ఇండియా లెవెల్ లోకి వస్తున్న సినిమా కావడంతో ఇది కూడా సేఫ్ కాదు అని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా కలెక్షన్స్ కి ఈ సినిమాలు ఎఫెక్ట్ అవుతాయని సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజ్ అవుతున్నారు మేకర్స్. దీంతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంపై మీకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: