తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలకు సంబంధించిన సినిమా షూటింగ్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. ఆ హీరోలు ఎవరు ..? ప్రస్తుతం వారు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు బాలకృష్ణ పై "బీ హెచ్ఈ ఎల్" లో బారి యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అజీజ్ నగర్ లో చిత్రీకరిస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ లోని ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర బృందం వారు ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం వాయుపపూరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మేకర్స్ ప్రస్తుతం నాగార్జున లేకుండా వచ్చే సీన్స్ ను మైసూర్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో అషిక రంగనాథ్ ... నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: