ఇప్పటికే నవంబర్ నెల చివరి దశకు చేరుకుంది. ఇకపోతే వచ్చే నెలతో ఈ సంవత్సరం కూడా ముగియబోతుంది. ఇక ఈ నెల మరియు వచ్చే నెల ఎండింగ్ వరకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఈ రోజు అనగా నవంబర్ 24 వ తేదీన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా శ్రీకాంత్ ఏం రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆది కేశవ సినిమా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇదే రోజు అనగా నవంబర్ 24 వ తేదీన శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన కోట బొమ్మాలి సినిమా కూడా విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత వచ్చే నెల డిసెంబర్ 1 వ తేదీన రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


ఇకపోతే ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అజరాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత డిసెంబర్ 8 వ తేదీన నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అలాగే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ లు విడుదల కానున్నాయి. ఇక డిసెంబర్ 21 వ తేదీన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన డంకి మూవీ ని విడుదల విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత డిసెంబర్ 22 వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: