తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి నచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సౌర్యవ్ దర్శకత్వం వహించగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ కి వాషిం అబ్దుల్ వహేభ్ సంగీతం అందించాడు. ఈయన తాజాగా ఖుషి అనే మూవీ.కి సంగీతం అందించాడు. ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఇప్పటి వరకు హాయ్ నాన్న మూవీ నుండి  ఈ చిత్ర బృందం విడుదల చేసిన పాటలు కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలోని "ఓడియమ్మ" అంటూ సాగే సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. 

ఇకపోతే ఈ సాంగ్ లో నాని తో పాటు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శృతి హాసన్ కూడా నటించింది. ఇకపోతే శృతి హాసన్ ఈ సాంగ్ లో నటించడంతో ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే దసరా మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న నాని హీరో గా నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: