తెలుగు సినీ ప్రేమికులకు అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో వరుసగా కామెడీ సినిమాలలో హీరోగా నటిస్తూ వచ్చాడు. అందులో చాలా వరకు మంచి విజయాలు సాధిస్తూ రావడంతో ఆయన కూడా కామెడీ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతూ వచ్చాడు. ఇక సుడిగాడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత నటించిన ఏ కామెడీ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. 

అలా చాలా సంవత్సరాల పాటు కామెడీ సినిమాలను నమ్ముకొని వరస అపజయాలను అందుకున్న ఈయన కొంత కాలం క్రితం నాంది అనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత ఈయన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ... ఉగ్రం అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు కూడా వైవిధ్యమైన సినిమాలే కావడం విశేషం. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోకపోయినా ఈ మూవీ లోని నటనకు గాను నరేష్ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందాయి.

ఇకపోతే తాజాగా ఈ నటుడు బచ్చల మల్లి అనే మరో వైవిధ్యమైన సినిమాను ప్రారంభించాడు. ఈ మూవీ కి సోలో బ్రతుకే సో బెటర్‌ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ లో అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటించబోతుంది. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్‌ దండా ... బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాప్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా ... దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లాప్‌ ఇవ్వగా ... దర్శకుడు విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మారుతి , బుచ్చిబాబు స్క్రిప్ట్‌ ని మేకర్స్‌కి అందజేశారు. 1990 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో యాక్షన్ ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ తో అల్లరి నరేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: