బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా మిషన్ రాణి గంజ్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 6 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు బారి స్థాయిలో కలెక్షన్ లు దక్కలేదు. అలాగే ఈ మూవీ కి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను హిందీ భాషలో తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా హిందీ భాషలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించగా ... టిను సురేష్ దేశాయ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అల్లరించక పోయినప్పటికీ ఈ మూవీ లోని అక్షయ్ కుమార్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంశలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: