యంగ్ హీరో తేజ్ సజ్జ హనుమాన్ పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్’ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఈ మూవీ టాప్ హీరోల సినిమాలతో పోటీపడుతూ సంక్రాంతి రేస్ లో ఎందుకు వస్తోందో ఇండస్ట్రీలోని చాలమందికి అర్థంకాని ప్రశ్నగా మారింది. ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇస్తున్న లీకులు ఇండస్ట్రీలో తలలు పండిన వారికి కూడ అర్థం కావడం లేదు అని అంటున్నారు.ఈమూవీని ఎట్టి పరిస్థితులలోనూ జనవరి 12న విడుదల చేస్తామని ప్రశాంత్ వర్మ ఏధైర్యంతో చెపుతున్నాడు అంటూ ఇండస్ట్రీలో చాలామంది షాక్ అవుతున్నారు. జనవరి 12న మహేష్ త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ రాబోతోంది. ఈమూవీకి తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లు ఇవ్వబోతున్నారు. ఈసినిమా విడుదలైన మారునాడే వెంకటేష్ రవితేజా ల సినిమాలు రాబోతున్నాయి. ఇక సంక్రాంతినాడు నాగార్జున ‘నాసామి రంగ’ రాబోతోంది. ఇన్ని సినిమాల మధ్య ‘హనుమాన్’ కు ధియేటర్లు ఎక్కడ ఉంటాయి అంటూ ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.వాస్తవానికి ‘హనుమాన్’ స్టిల్స్ కు టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై భారీ స్థాయిలో అంచనాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి అంచనాలు ఉన్న ఒక చిన్న సినిమా ఎటువంటి పోటీ లేకుండా విడుదల అయితే ఆసినిమాకు మంచి కలక్షన్ లు వచ్చే ఆస్కారం ఉంది. అయితే ఇలాంటి ప్రధాన విషయాన్ని పక్కకు పెట్టి ‘హనుమాన్’ మూవీ నిర్మాతలు తాము సంక్రాంతికి రెడీ అంటూ ఇస్తున్న లీకులు వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే సంక్రాంతి రేస్ కు ఎన్ని భారీ సినిమాలు వచ్చినప్పటికీ వాటి మధ్యలో విడుదల అయిన కొన్ని చిన్న సినిమాలను క్రితం గత సంక్రాంతి రేస్ లలో నిలబెట్టిన సందర్భాలు గతంలో చాల ఉన్నాయి. అయితే కంటెంట్ విషయంలో అంచనాలాను అందుకోగలిగితే గతంలో సంక్రాంతికి వచ్చిన కొన్ని చిన్న సినిమాలు ఊహించని హిట్ అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి..  మరింత సమాచారం తెలుసుకోండి: