తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇకపోతే ఇప్పటికే ఈ రియాలిటీ షో తెలుగులో ఆరు టీవీ సీజన్ లను ... ఒక "ఓ టి టి" సీజన్ ను పూర్తి చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ టెలివిజన్ 7 వ సీజన్ ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సీజన్ కి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ 7 వ సీజన్ కు సంబంధించిన 12 వారాల ఆట ముగిసింది.

ప్రస్తుతం 13 వ వారం ఆట కొనసాగుతుంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 7 వ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. ఇకపోతే బిగ్ బాస్ లో దాదాపు ప్రతి వారం నాగార్జున వచ్చిన సమయంలో ఎవరో ఒక గెస్ట్ వాస్తు తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈ వారం కూడా ఒక ప్రముఖ నటుడు ఈ షో కు గెస్ట్ గా వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మృణాల్ ఠాగూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... సౌర్యవ్ ఈ మూవీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా నాని "బిగ్ బాస్" కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా రేపు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: