తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో అడవి శేషు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక అలాంటి సమయం లోనే ఈ నటుడు క్షణం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో ఈయన తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో శేషు కు ఈ మూవీ తో తెలుగు లో మంచి గుర్తింపు లభించింది.

 ఇక ఆ తర్వాత వరుసగా ఈయన గూఢచారి ... ఎవరు ... మేజర్ మూవీ లతో వరుస విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా అడవి శేషు ... శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ ప్రంచేజ్ నుండి రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 ఇకపోతే ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ రోజుతో సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ లో అడవి శేషు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా ... సుహాస్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. సుహాస్ కూడా ఈ మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: