నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ... కొన్ని పాటలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ షో కు కూడా నాని "హాయ్ నాన్న" మూవీ ని ప్రమోట్ చేయడానికి తాజాగా గెస్ట్ గా వచ్చినట్లు సమాచారం.

 ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా తాజాగా పూర్తి అయినట్లు ... ఈ ఎపిసోడ్ రేపు అనగా ఆదివారం రోజు టెలికాస్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి ... రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 155 నిమిషాలు అనగా 2 గంట 35 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే నాని ఇప్పటికే ఈ సంవత్సరం దసరా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. మరి ఆయన హాయ్ నాన్న మూవీ తో ఈ సంవత్సరం మరో విజయాన్ని అందుకుంటాడో లేదా తెలియాలి అంటే డిసెంబర్ 7.వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: