ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమా ట్రైలర్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 తెలుగు ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ దక్కాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 1.238 మిలియన్ లైక్స్ లభించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయం లో 1.219 మిలియన్ లైక్స్ లభించాయి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకరత్వం లో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 1.11 మిలియన్ లైక్స్ లభించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 1.006 మిలియన్ లైక్స్ లభించాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 893 కే లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: