తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు పొందిన దర్శకులలో విక్రమ్ కే కుమార్ ఒకరు. ఈయన మొదటగా 13b అనే మూవీతో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు నితిన్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా ఇష్క్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈయన అక్కినేని నాగేశ్వరరావు ... నాగార్జున ... నాగ చైతన్య ... అఖిల్ ప్రధాన పాత్రల్లో "మనం" అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన నాగ చైతన్య ప్రధాన పాత్రలో దూత అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈయన నాగ చైతన్య హీరోగా థాంక్యూ అనే మూవీక్ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విక్రమ్ "థాంక్యూ" మూవీ ప్రేక్షకులను అలరించకపోవడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవ్వడానికి గల కారణాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విక్రమ్ మాట్లాడుతూ ... కరోనా చాలా ఉధృతంగా ఉన్న టైమ్ లో థాంక్యూ కథ పుట్టింది.

కరోనా టైమ్ లో ఉన్న పరిస్థితులను చూసుకుంటే డబ్బు .. పేరు .. హోదా ఏవీ ఒక మనిషిని కాపాడలేవని అర్థమైంది. దానితో మనకు ఎవరైనా సహాయం చేస్తే వారికి థాంక్యూ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కథ పుట్టింది. అలాగే ఈ సినిమాను రూపొందించాం. కానీ ఆ తర్వాత కరోనా తగ్గిపోయింది. మనుషుల ఆలోచన శైలి కూడా మారిపోయింది. అలాంటి సమయంలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా ఎమోషనల్ గా జనాలకు కనెక్ట్ కాలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది అని విక్రమ్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: