
స్టార్ హీరోలకి మించిన రెమ్యూనరేషన్ తీసుకొని స్టార్ స్టేటస్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన సిల్క్ స్మిత ఒకానొక దశలో అనుకోకుండా కొన్ని పరిస్థితుల కారణంగా కృంగిపోవడంతో ఆత్మహత్య చేసుకుని మరణించింది . ఈమె సూసైడ్ అప్పట్లో ఒక సంచలనమే అని చెప్పాలి... వెండితెరపై బోల్డ్ పాత్రలో నటించింది కానీ తెర వెనక మాత్రం సిల్క్ స్మిత చాలా మంచిది అంటూ అప్పట్లో ఎంతో మంది చెప్పుకొచ్చారు.వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చేదు సంఘటనలు ఎదుర్కొన్న ఆమె 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకున్నారు..సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ మెయిన్ లీడ్ లో బాలీవుడ్‌లో 'డర్టీ పిక్చర్' మూవీ తెరకెక్కింది.. అయితే తాజాగా సిల్క్ స్మిత జీవితం పై మరో బయోపిక్ తెరకెక్కబోతుంది. నేడు డిసెంబర్ 2 ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె బయోపిక్ ని అనౌన్స్ చేశారు. ఇండియన్ ఆస్ట్రేలియా నటి చంద్రిక రవి ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో కనిపించబోతుంది. నేడు ఆమె ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేశారు . 'సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో చంద్రిక సిల్క్ స్మితలా కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.