అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ లాంటి రెండు వరుస బ్లాక్ బాస్టర్ విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగ "యానిమల్" అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అనిల్ కపూర్మూవీ లో రన్బీర్ కి తండ్రి పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా రాబట్టిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొత్తం గా 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 20.65 కోట్ల షేర్ ... 40.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే 5.65 కోట్ల షేర్ కలెక్షన్ లను ఎక్కువగా రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: