తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో నాని ఒకరు. ఈయన తాజాగా హాయ్ నాన్న అనే ఒక క్లాస్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో ... టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను సూపర్ గా ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. అందులో భాగంగా ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది.

మూవీ 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ కి అదిరిపోయే పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ 2 గంటల 35 నిమిషాల నిడివి కలిగిన ఒక ఎమోషనల్ రైడ్ లాంటిది అని ... ఈ సినిమాలో నాని పెర్ఫార్మెన్స్ ... సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి అని ... మరి ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీ కి అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని సెన్సార్ బోర్డు సభ్యులు రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: