నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన హాయ్ నాన్న సినిమా ఈ నెల 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో కూడా ఒకే సారి విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 6 వ తేదీనే ఈ మూవీ ప్రీమియర్ లను "యూ ఎస్ ఏ" లో ప్రదర్శించనున్నారు. ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా "యూ ఎస్ ఏ" టూర్ కు సంబంధించిన ఆసక్తికరమైన డీటెయిల్స్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ బృందం డిసెంబర్ 8 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు "యూ ఎస్ ఏ" లోని కొన్ని ప్రాంతాలను పర్యటించబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేసింది. మరి ఈ మూవీ యూనిట్ "యూ ఎస్ ఏ" లోని ఏ ప్రాంతాలను పర్యటించబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం.మూవీ బృందం ఈ నెల 8వ తేదీన డల్లాస్ ప్రాంతాన్ని పర్యటించబోతుంది. ఆ తర్వాత 9 వ తేదీన న్యూ జెర్సీ మరియు న్యూయార్క్ ప్రాంతాలను పర్యటించబోతుంది. ఆ తర్వాత డిసెంబర్ 10 వ తేదీన సన్ జోస్ , సన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాలను పర్యటించబోతుంది. ఇక ఆ తర్వాత డిసెంబర్ 12 వ తేదీన ఈ మూవీ బృందం వర్జీనియా ప్రాంతాన్ని పర్యటించబోతుంది. ఇకపోతే ఈ మూవీ కి సౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించగా ... ఈ మూవీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఖుషి సినిమాకు సంగీతం అందించిన వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: