
యానిమల్ సినిమాతో వచ్చిన క్రేజీ వల్ల ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. అందుకే బాలీవుడ్లో స్థిరపడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి మొదట ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తరువాత వరుసగా గీతాగోవిందం భీష్మ సరిలేరు నీకెవరు వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది రష్మిక.
అలా ఏ ఇండస్ట్రీలోకి వెళ్లిన స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ అమితాబచ్చన్ తో కూడా కలిసి బాలీవుడ్ లో గుడ్ బై సినిమాలో నటించింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను తదితర చిత్రాలతో నటించి మంచి క్రేజ్ అందుకున్న రష్మిక ఇటీవలే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటించింది. డిసెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని సైతం అందుకున్నది. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు సైతం వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రష్మిక ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చేయబోతున్నట్లు బాలీవుడ్ ఫిలిం సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత వాస్తవం ఉన్నదో తెలియాలి అంటే రష్మిక స్పందించాల్సిందే..