టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ డ్యాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అమిగొస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అశిక రంగనాథ్మూవీ లో నాగార్జున కి జోడిగా కనిపించబోతుంది. 

ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణం గానే ఈ మూవీ బృందం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది. ఇక ఈ మూవీ విడుదల సమయం కూడా దగ్గర పడడంతో ఈ మూవీ లోని మొదటి పాట విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది.

మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే" అంటూ సాగబోయే సాంగ్ యొక్క ప్రోమో ని మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో నాగార్జున తెల్ల కలర్ లో ఉన్న పంచను కట్టుకొని ... బ్లూ కలర్ లో ఉన్న హాఫ్ హ్యాండ్ షర్ట్ ను వేసుకొని టాక్టర్ పై కాలును వేసి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ పై నాగార్జున అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: