
ఈ మూవీ కి నైజాం ఏరియాలో 8.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 2.60 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 9 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఓవర్ సీస్ లో ఈ మూవీ కి 5.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 27.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిపోతుంది. ఈ మూవీ కనక ప్రపంచ వ్యాప్తంగా 28.50 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.