యానిమల్  సినిమాతో ఇండియన్ డైనమిక్ ఫిలిం మేకర్స్ లిస్ట్ లో చేరిపోయాడు ఈ డైరెక్టర్. సెన్సార్ 'A' సర్టిఫికెట్ ఇచ్చిన 'యానిమల్' మూవీ కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక నార్త్ ఆడియన్స్ అందరూ సందీప్ రెడ్డి వంగ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో యానిమల్ సినిమాలో డైరెక్టర్ సందీప్ చేసిన ఓ పని గురించి సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతుంది.

అదేంటంటే, ఈ సినిమాలో రణ్ విజయ్ పాత్రను పోషించిన రణ్ బీర్ కపూర్ ఓ చర్చ్ కి వెళ్తాడు. తన పాపాలను ఒప్పుకోవడానికి చర్చ్ లో ఉన్న ఫాదర్ ని కలవమని చెబితే అతని ముందే సిగరెట్ తాగుతాడు. ఆ తర్వాత సినిమాలో విలన్ పాత్ర పోషించిన బాబీ డియోల్ ఇద్దరు భార్యలు ముస్లిం వేషధారణలో ఉండి మరీ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తారు. కానీ అదే సమయంలో హీరో రణబీర్ కపూర్ హిందూ సాంప్రదాయాన్ని ఎంతో గౌరవిస్తాడు. సినిమాలో రణబీర్, రష్మిక ఇద్దరు ఓ హిందూ యాగంలో పాల్గొంటారు. రణ్ బీర్ ఎంతో చిత్తశుద్ధితో ఈ యాగం లో పాల్గొంటాడు.

దీంతో ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో హిందూ సంప్రదాయాన్ని ఎంతో గౌరవంగా చూపించాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం డైరెక్టర్ సందీప్ వంగా ముస్లిం సంస్కృతిని కించపరుస్తూ హిందూ సాంప్రదాయానికి గౌరవం ఇస్తూ సంఘీవంగా మారాడని సెటైర్లు పేలుస్తున్నారు. ఇదొక్కటే కాదు ఇలాంటి రెచ్చగొట్టే సన్నివేశాలు సినిమాల్ఓ ఇంకా చాలానే ఉన్నాయి. కానీ నెటిజన్స్ మాత్రం ఆ ఒక్క సీన్ ని గమనించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందీప్ వంగా ఇతర సంస్కృతిని కించపరుస్తూ హిందూ సంప్రదాయాన్ని మాత్రమే గౌరవించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: