లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే నయనతార ఎప్పటిలా హీరోయిన్ లాగా కాకుండా ఇప్పుడు కాస్త పెద్దరికం ఉన్న పాత్రలో కనిపించబోతుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఇప్పటికే హీరోయిన్గా నటించింది నయనతార. తాజాగా ఇప్పుడు మరొకసారి ఆయన దర్శకత్వంలోనే మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోయిన్గా వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న

 నయనతార ఇప్పుడు ఏకంగా అక్క పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. లవ్ టుడే వంటి బ్లాక్ బస్టర్ హిట్ నూతన ఖాతాలో వేసుకున్న యంగ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ ను హీరోగా విఘ్నేష్ శివన్ ఒక సినిమాని తీస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటిని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ నెలలోనే సెట్స్ ఫైకి ఈ సినిమా వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. షార్ట్ గా ఎల్ఐసి అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.

ఇందులో సీనియర్ దర్శక నటుడు ఎస్ జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలను పోషించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇందులో నయనతార ప్రదీప్ రంగనాథన్‌కు అక్కగా నటించేందుకు సమ్మతించినట్లు వినికిడి. తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో 'నానుమ్ రౌడీదాన్', 'కాత్తువాక్కుల రెండు కాదల్' అనే చిత్రాల్లో నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రంలో ఆమె నటించనుంది. అలా ప్రస్తుతం ఈ సినిమాలో మొదటిసారి నయనతార అక్క పాత్రలో కనిపించబోతోంది. దీంతో నయనతార అక్క పాత్రలో కనిపించడం ఏంటి అంటూ నయనతార అభిమానులు కామెంట్లు పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: