అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో నాగచైతన్య ఒకరు. ఇక అక్కినేని ఫ్యామిలీకి అసలు సిసలైన వారసుడిగా కూడా చైతన్య కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుండి నాగచైతన్యకు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా 6 హిట్స్ తో దూకుడు మీద ఉన్న నాగచైతన్య విజయాలకు థాంక్యూ అనే మూవీ బ్రేక్ వేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత చైతన్య నటించిన కస్టడీ సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది అన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ గానే నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అందరు కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్తగా ప్రయత్నించాడు నాగ చైతన్య. ఈసారి సినిమాతో కాకుండా వెబ్ సిరీస్ తో ఆడియన్స్ కి హాయ్ చెప్పాడు అని చెప్పాలి. దూత అనే వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.


 ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నిర్మాతలకు కూడా లాభాలు వచ్చాయట  ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం నాగచైతన్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక ఈ వెబ్ సిరీస్ కి లాభాలు రావడంతో అటు నాగచైతన్య కి ముందుగా అనుకున్న దానికంటే అధిక రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ వెబ్ సిరీస్ కోసం పది కోట్ల పారితోషికం ఫిక్స్ చేశారు. కానీ ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఐదు కోట్లు అదనంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా ఏకంగా వెబ్ సిరీస్ కోసం ఒక మూవీకి తీసుకునే పారితోషకం  అందుకున్నాడు నాగచైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: