తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన హీరోలు అందరూ కూడా మంచి గుర్తింపును సంపాదించి స్టార్ హీరోలుగా హవా నడిపిస్తున్నారు. కానీ ఎందుకో అక్కినేని హీరోలకు మాత్రం అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్ ఉన్న అసలు కలిసి రావడం లేదు. నాగార్జున వారసుడిగా  ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య కాస్త కూసో నిలదొక్కుకున్నాడు. కానీ ఇక భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అఖిల్ మాత్రం.. ఇప్పటివరకు సరైన హిట్టు కొట్టలేకపోయాడు అని చెప్పాలి.


 అయితే అక్కినేని నాగచైతన్య సైతం ఇప్పటివరకు కెరియర్ లో అడపాదడప విజయాలు మాత్రమే సాధించాడు. కమర్షియల్ గా నాగచైతన్య నటించిన సినిమాలు హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అయితే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతూనే ఉన్నాడు ఈ అక్కినేని హీరో. మొన్నటివరకు థాంక్యూ కస్టడీ లాంటి సినిమాలతో ఫ్లాప్స్ చవి చూసాడు. అయితే ఇటీవల రూట్ మార్చి ఏకంగా దూత అనే వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కి మంచి స్పందన వస్తుంది అని చెప్పాలి.


 అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ నాగచైతన్యకు మొదటి ఓటీటి సిరీస్ కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ క్రమంలోనే తన సినిమాలలో ఒక ఫ్లాప్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని  తెలిసి కూడా నటించాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా ఏదో కాదు హిందీలో హీరో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా చేసేటప్పుడు సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలిసినప్పటికీ.. ఈ సినిమాలో నటించాను. అయితే ఎందుకు నటించారో కారణం చెబుతూ.. నాకు అమీర్ ఖాన్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ సినిమా ఫలితం గురించి ఆలోచించకుండా సినిమా చేశాను. ఫలితం ముందే ఊహించాను కాబట్టి ఫ్లాప్ కావడం పెద్దగా బాధించలేదు. కానీ ఇప్పటికే అలాంటి సినిమాలో నటించినందుకు గర్వపడుతున్న అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: