కన్నడ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే కన్నడ సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాలుగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ నటుడు కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన "కే జి ఎఫ్ చాప్టర్ 1" మరియు "కే జీ ఎఫ్ చాప్టర్ 2" సిరీస్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

 ఈ సినిమాను కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈ నటుడి క్రేజ్ ఇండియా వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలతో ఈ నటుడు క్రేజ్ భారీగా పెరగడంతో ఈ మూవీ లు విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్న ఈ నటుడు నెక్స్ట్ మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఈయన తన తదుపరి మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఎట్టకేలకు యాష్ 19 వ సినిమాకు సంబంధించిన క్రేజీ ప్రకటన కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. తాజాగా ఈ మూవీ బృందం యాష్ 19 వ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ను రేపు ఉదయం 9 గంటల 55 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి యాష్ కి జోడిగా నటించే అవకాశం ఉన్నట్లు వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: