హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన తాజాగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన డంకి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో తాప్సి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 


మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సంవత్సరం మొదట షారుఖ్ "పటాన్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత జవాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. మరి ఈ సంవత్సరం షారుక్ "డంకి" అనే మూవీ తో మూడవ సారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మరి ఈ మూవీ తో ఏ స్థాయి విజయ్యని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: