నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కాయి. మరి ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ మూవీకి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.64 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 24 లక్షలు , యు ఏ లో 43 లక్షలు , ఈస్ట్ లో 14 లక్షలు , వేస్టు లో 8 లక్షలు , గుంటూరు లో 14 లక్షలు , కృష్ణ లు 17 లక్షలు , నెల్లూరు లో 7 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 2.91 కోట్ల షేర్ ... 5.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. 

మూవీ కి మొదటి రోజు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 55 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 2.05 కోట్ల కలెక్షన్ దక్కాయి. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 5.51 కోట్ల షేర్ ... 10.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 27.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 22.99 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అంటుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: