నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ఈ నెల డిసెంబర్ 7 వ తేదీన మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి జెమినీ సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అలా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను జెమినీ టీవీ లో తెలుగు లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నాని మొదటగా దసరా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇక తాజాగా హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకులను పలకరించిన నానిమూవీ తో కూడా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా నాని ఈ సంవత్సరం రెండు మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాలను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: