టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. తొలిరోజు నుంచి మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ మౌత్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు రెండు కోట్ల తొంభై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ, శనివారం రోజు మాత్రం నాలుగు కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి నాలుగున్నర కోట్ల దాకా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.ఫస్ట్ వీకెండ్‌లో నైజాం ఏరియాలో అత్యధికంగా 14 కోట్ల దాకా హాయ్ నాన్న గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. నైజాం ఏరియా తర్వాత ఓవర్‌సీస్‌లో ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఫస్ట్ వీకెండ్‌లోనే మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోయి సూపర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డుతో నాని మొత్తం 9 మిలియన్ డాలర్ సినిమాలు ఇచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాతి స్థానంలో నిలిచాడు. మహేష్ 11 మిలియన్ డాలర్ సినిమాలతో సౌత్ లోనే నెంబర్ హీరోగా దూసుకుపోతున్నాడు.


హాయ్ నాన్న మూవీ వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా రిలీజైంది.మరో రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ కావడం ఖాయమని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఇక హాయ్ నాన్న సినిమాలో నానికి జోడీగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్‌, బేబీ కియారా కీలక పాత్రల్లో నటించారు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి లవ్ స్టోరీని జోడించి తెరకెక్కిన ఈ మూవీతో శౌర్యువ్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ కి ఇప్పటికి ఈ సినిమా 100 కోట్లు సాధించాలిసి ఉంది. కానీ ఈ సినిమా విషయంలో నానికి అన్యాయం జరిగింది. ఈ సినిమాకి చాలా తక్కువ థియేటర్ లు ఇచ్చారు. ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయిచ్చి ఉంటే ఈ సినిమా వసూళ్లు పెరిగి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: