టాలీవుడ్ లో నటుడుగా శివాజీ ఎన్నో చిత్రాలను నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే మధ్యలో సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పాల్గొని గుర్తింపు కాస్త ఎక్కువే సంపాదించుకున్నారని చెప్పవచ్చు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత శివాజీ ఎక్కువగా పొలిటికల్ పరంగానే ఉండేవారు. ప్రత్యేక హోదా అని డెబిట్ పెట్టి అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీ వరకు అందరిని ప్రశ్నించారు. శివాజీ అయితే ఈ మధ్యకాలంలో రాజకీయాలలో కాస్త ఇనాక్టివ్గా కనిపిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన తర్వాత మంచి క్రేజీ ని అందుకున్నారు శివాజీ.


ఇటీవలే 90 అనే వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ లో భాగంగా శివాజీ ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురు కావడంతో తనదైన స్టైల్ లో స్పందించారు.. త్వరలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి శివాజీ గారి పాత్ర ఏంటి.. గతంలో లాగా రాజకీయాలలో చూస్తామా అని అడగగా.. అందుకు శివాజీ బదిలిస్తే నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ పొలిటికల్స్ లో పాల్గొనలేదని తెలిపారు.


నేను ఎప్పుడు ప్రజల సమస్య మీదే పోరాడుతూ ఉంటాను తప్ప నాకు ఏ రాజకీయ పార్టీతో ఎటువంటి భేదాలు లేవని తెలిపారు చంద్రబాబు జగన్ కేసీఆర్ తో తనకు ఏ బంధం కూడా లేదని నన్ను రాజకీయాలలోకి లాగితే నేను ఆ పార్టీల దులా తీరుస్తానంటూ తెలిపారు.. నేను నిజాలు మాట్లాడతాను అంతే రాజకీయాలలో పనికిరాను.. నన్ను ఏ పార్టీ వాళ్లు అంకితం చేసుకుంటే నేను మాట్లాడే మాటల వల్ల చాలా ఇబ్బందులు పడతారు అందుకే నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదంటూ తెలిపారు నేను ప్రజల కోసమే మాట్లాడుతానంటూ తెలిపారు.. తన పిల్లలు మాత్రం తనని సినిమాలలోనే యాక్ట్ చేయమని కోరారని అందుకే సినిమాలలోని కొనసాగుతున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: