టాలీవుడ్  హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ దేవర. ప్రస్తుతం ఎన్టీఆర్సినిమా లో నటిస్తూ బిజీ బిజీ  గా ఉన్న విషయం తెలిసిందే.కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకం గా ఈ సినిమాను నిర్మి స్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలం లో తరచూ ఈ సినిమా కు సంబం ధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది.  ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అయితే రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌ లో కనిపిస్తారని ఇన్నాళ్లు టాక్ నడిచింది. కానీ తాజాగా ఇప్పుడు మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. దేవర లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.కానీ, దేవర టీమ్ నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్‌ పాత్రలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఒకవేళ, ఎన్టీఆర్ మూడు పాత్రల వార్త నిజమైతే ఇది నిజంగా తారక్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించ బోతున్నాడు.   కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్కథానాయిక గా నటిస్తుంది.ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజు కూ అంచనాలు పెరుగు తున్నాయి. ఒకవేళ ప్రస్తుతం వార్తలో వినిపిస్తున్నట్టుగా ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తే జై లవకుశ మ్యాజిక్ రిపీట్ అయినట్లే అని చెప్పవచ్చు. కాగా జై లవకుశ సినిమా లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: