రకుల్ ప్రీతిసింగ్ నిన్నటి రోజున తన ప్రియుడు జాకీ భగ్నానీ పెళ్లి చేసుకోవడం జరిగింది. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనంద్ కరాజ్ ఆచారాల ప్రకారమే వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత సింధీ సాంప్రదాయం ప్రకారం కూడా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె అభిమానులు ఎంతో కాలం నిరీక్షించిన సమయం ముగిసిందని చెప్పవచ్చు. రకుల్, జాకీ కి సంబంధించి పెళ్లి ఫోటోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది.


ఈ ఫోటోలకు ఇలా క్యాప్షన్ రాసుకు వస్తూ.. ఈరోజు ఈ భగ్నానీ ఎప్పటికీ నావి అంటూ ఒక లవ్ ఎమోజిని తెలియజేస్తూ తెలిపింది. సెలబ్రిటీలు రకుల్ పోస్ట్ పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.. జెనీలియా, వరుణ్ ధావన్, సమంత, జాక్వలిన్, మృణాల్ ఠాకూర్ తదితర సెలబ్రిటీల సైతం ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరు పెళ్లి ఫోటోలు విషయానికి వస్తే ఇందులో రకుల్ ప్రీతిసింగ్ కూడా చాలా క్యూట్ గా కనిపిస్తోంది ఏమి వివాహ విషయంలో చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నట్టుగా ఈ ఫోటోలను చూస్తే మనకు కనిపిస్తోంది.


రకుల్ తన పెళ్లి కోసం పింక్ కలర్ లెహంగాను ధరించింది ఈ సమయంలో కూడా తన చేతులకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ని సైతం ధరించినట్టు కనిపిస్తోంది. అలాగే భారీ నగలతో కనిపించిన ఈ జంట షేర్ చేసిన ఫోటోలలో జాకీ ప్రేమలో రకుల్ మునిగి తేలుతున్నట్టుగా ఆమె కళ్ళలో కనిపిస్తోంది. రకుల్ జాకీ ఈ వివాహ ఫోటోలు కొన్ని నిమిషాలలోనే వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం వీరికి సంబంధించి ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: