దాంతో ప్రీతి జింటాని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రాఘవేంద్రరావు మహేష్ బాబుకి మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందించి ఒక సక్సెస్ ఫుల్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తో సాక్షి శివానంద్ ఆ తర్వాత ‘యువరాజు ‘అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక మొత్తానికైతే మహేష్ బాబు స్టార్ హీరో అవడానికి రాఘవేంద్ర రావు గారి హస్తం కూడా చాలా వరకు పనిచేస్తుందనే చెప్పాలి. కృష్ణ ఏ నమ్మకం తో అయితే రాఘవేందర్రావు చేతిలో మహేష్ బాబును పెట్టాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ సక్సెస్ సినిమాను తీసి మహేష్ బాబుకు ఒక మంచి మార్కెట్ ను అయితే క్రియేట్ చేశాడు. ఇండస్ట్రీలో మిగతా ఏ హీరోలకు దక్కనంత మంచి డెబ్యూ ఫిలిం ని మహేష్ బాబుకు అందించి కృష్ణ నమ్మకాన్ని నిలబెట్టడనే చెప్పాలి…
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి