బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్‌ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు. ఈ రెండు సీరియల్స్‌ బుల్లితెరను కొన్ని సంవత్సరాల పాటు శాసించాయి.ఇక సీరియల్‌లో నటించిన నటీనటులను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ ఇలా అన్ని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికీ వారంతా ఓ ఫ్యామిలీలానే ఉంటారు. ఈ క్రమంలో ఓ చేదువార్త వెలుగులోకి వచ్చింది. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌లో ఇంద్రనీల్‌ తమ్ముడి పాత్రలో నటించి.. ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నారు పవిత్రనాథ్. ఈ విషయాన్ని ఇంద్రనీల్‌ భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ''పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్‌ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి'' అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.ఇక మేఘన, ఇంద్రనీల్ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. అసలేం జరిగింది.. దయ చనిపోవడం ఏంటి.. ఇదంతా ఎప్పుడు జరిగింది.. ఎందుకు ఎలా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక గతంలో పవిత్రనాథ్‌పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని.. దీని గురించి ప్రశ్నిస్తే.. తనను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: