సూపర్ స్టార్ రజినీకాంత్ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి జైలర్ అనే మూవీతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు . ఇక జైలర్ సినిమా తర్వాత రజిని తన కూతురు అయినటు వంటి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం లో రూపొందిన లాల్ సలామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు . ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. రజిని "జైలర్" మూవీ తర్వాత కొన్ని మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . అందులో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఓ మూవీని ఓకే చేశాడు.

ఇతను ఖైదీ, మా నగరం, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు . దేశ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న రజిని, లోకేష్ కాంబో లో మూవీ అనౌన్స్ కాగానే ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఈ చిత్రానికి ఈ మూవీ మేకర్స్ ఇప్పటివరకు  టైటిల్ ను ఖరారు చేయలేదు . ఈ సినిమా రజినీ కెరియర్లో 171 వ మూవీగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని "తలైవర్ 171" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు ఒక పవర్ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం "కళుగు" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు దీనికి తెలుగులో "డేగ" అని అర్థం. ఒకవేళ "కళుగు" టైటిల్ నే కనక ఫిక్స్ చేసినట్లు అయితే అన్ని భాషల్లో ఇదే టైటిల్ తో ఈ మూవీని విడుదల చేస్తారా..? లేకపోతే వేరు వేరు భాషల్లో ఇతర టైటిల్స్ తో విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: