విక్టరీ వెంకటేష్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా విజయభాస్కర్ దర్శకత్వంలో మల్లీశ్వరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , మాటలు మరియు స్క్రీన్ ప్లే ను అందించాడు.ఈ మూవీ కథ , స్క్రీన్ ప్లే మాటలు అద్భుతంగా ఉండడం అలాగే ఈ సినిమాను విజయభాస్కర్ అత్యద్భుతంగా చిత్రీకరించడంతో ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ మూవీ లో వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోక కత్రినా కైఫ్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈమెకు తెలుగు లో ఇదే మొదటి సినిమా. మరి ఈమె ఈ సినిమాలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది అనే దాని వెనక పెద్ద కథ ఉంది. అసలు మేటర్ ఏమిటో తెలుసుకుందాం.

త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయభాస్కర్ "మల్లీశ్వరి" మూవీ కి సంబంధించిన కథ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత హీరోగా వెంకటేష్ ఓకే చేసుకున్నారు. ఇక సినిమాలో ఒక ప్రిన్సెస్ లాంటి అమ్మాయి కావాలి అనే వెతుకులాటలో పడ్డారు. అందులో భాగంగా ఎంతో మంది మాడల్స్ తో ఫోటో షూట్ చేశారు. కానీ ఎవరు కూడా ఆ పాత్రకు సెట్ కావడం లేదు.

అలాంటి సమయంలో టీవీ లో ఒక రోజు విజయ భాస్కర్ ఒక చిన్న ఆడ్ చేశాడు. అందులో ఉన్న కత్రినాను చూసి ఈమె అయితే ఆ పాత్రకు బాగుంటుంది అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెను పిలిపించి ఫోటో షూట్ చేశారు చివరకు ఈమె మూవీలో హీరోయిన్ గా ఓకే అయ్యింది. కానీ చివరకు ఆమె చేయను అంది. కానీ ఈమెను బ్రతిమిలాడి ఈ సినిమాలో చేయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: