1996 వ సంవత్సరం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు అనే మూవీ విడుదల అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో ఇండియన్ అనే పేరుతో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలలో అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించాడు. 

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో భారతీయుడు 2 అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు అలాగే ఈ సినిమా లోని మొదటి పాటను మే 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క మొదటి పాట యొక్క ప్రోమో ను మరియు ఈ సినిమా యొక్క టోటల్ లిరికల్ వీడియోను ఏ సమయానికి విడుదల చేయబోతున్నాం అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

పోస్టర్ ప్రకారం ఈ రోజు అనగా మే 21 వ తేదీన ఈ సినిమాలోని మొదటి సాంగ్ అయినటువంటి సౌర అంటూ సాగే పాట ప్రోమో ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు , అలాగే ఈ సాంగ్ యొక్క పూర్తి లిరికల్ వీడియోను రేపు అనగా మే 22 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: