టాలీవుడ్, శాండిల్ వుడ్ లో నటుడుగా పేరు పొందిన దర్శన్ కు మంచి పేరు ఉన్నది. అయితే అనుకోకుండా గడిచిన రెండు రోజులుగా దర్శన్ పేరు మరింత ఎక్కువగా వినిపిస్తోంది.. ముఖ్యంగా రేణుక స్వామి హత్య కేసులో ఈయన పాత్ర ఉందని తేలడంతో ఈ హీరోని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. సినిమాలలో హీరో అయిన దర్శన్ రియల్ లైఫ్ లో మాత్రం విలన్ గా మారిపోయారు. అయితే దర్శన్ తప్పు చేశాడనే విషయం పైన కుటుంబ సభ్యులు మాత్రం అసలు నమ్మడం లేదు.


తాజాగా దర్శన్ కుమారుడు తన తండ్రి పైన జరుగుతున్న  ప్రచారం పైన స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. దర్శన్ కొడుకు పేరు వినిష్ తూగూది తన తండ్రి దర్శన్ తో పాటు తల్లి విజయలక్ష్మి కి కూడా మానసికంగా ప్రశాంతత ఇప్పుడు అవసరమంటూ తెలియజేశారు.తన తండ్రిని బూతులతో దూషిస్తూ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు అంటూ చెప్పుకోచ్చారు.. తన తండ్రి హత్య చేసి ఉంటాడని తాను నమ్మడం లేదంటూ అని కూడా తెలియజేశారు.


పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే అసలు నిజాలు బయటికి వస్తాయని దర్శన్ కొడుకు వినిష్ తూగూది తెలియజేశారు. అప్పటివరకు కాస్త ఓపిక పట్టండి అంటూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం దర్శన్ కుమారుడి వయసు 15 సంవత్సరాలు అయితే ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడంతో అభిమానులు సైతం ప్రశంసలతో ప్రశంసిస్తున్నారు.అలాగే దర్శన్ కూడా ఈ కేసు నుంచి బయటపడతారు అంటూ తన కొడుక్కి ధైర్యం చెబుతున్నారు. కానీ ఆధారాలు కూడా దర్శన్ వైపు తప్పు ఉందని చెబుతూ ఉండడం గమనార్హం. స్టార్ హీరో అయినటువంటి దర్శన్ చిన్న చిన్న తప్పులు వల్ల తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారని అభిమానులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: