కోలీవుడ్ టాలీవుడ్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కంగువ..ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లేవల్లో అత్యధిక భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కంగువ సినిమా నుంచి విడుదలైన.. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ హైప్ పెంచేశాయి.. గడిచిన కొన్ని నిమిషాల క్రితం కంగువ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ కాంబినేషన్లో తెరకెక్కించడం జరిగింది.


కంగువ సినిమా ఇంకా విడుదలకు రెండు నెలలు సమయం ఉండగానే ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇప్పటి నుంచే ప్రమోషన్ కూడా వేగవంతం చేసేలా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక అద్భుతమైన విజువల్స్ తో డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఉండే సన్నివేశాలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. హీరో సూర్య నటన కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. అలాగే విలన్ గా బాబి డియోల్ కూడా తన యాక్టింగ్ తో భయపెట్టించేలా చేసినట్టు కనిపిస్తోంది. హీరోయిన్గా దిశాపటాని కూడా ఇందులో నటిస్తోంది. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ తోనే హవా చూపిస్తున్నారు హీరో సూర్య.



కంగువ సినిమాకి సంబంధించి ఫస్ట్ కాపీ కూడా సిద్ధం అయిపోయిందని.. అందుకే ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసిందట. ఆ తర్వాత ప్రమోషన్స్ని కూడా మరింత గట్టిగా చేసి సినిమా హైప్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.. బాహుబలి సినిమా తరహాలోనే అద్భుతాలను చేయగలిగే సత్తా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి సూర్య కంగువ  సినిమాతో ఎలాంటి క్రేజ్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: